ఇంటి దొంగలు అరెస్ట్ – డిఎస్పి వెంకటస్వామి!

J.SURENDER KUMAR,

డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ లో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరి నీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పి వెంకటస్వామి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన
తెలిపారు.

జగిత్యాల పట్టణం నూకపల్లి డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపిక పై అక్రమాలకు పాల్పడిన భోగ రాకేష్, చంద్ర శేఖర్ అరెస్ట్ చేశామన్నారు
A1. భోగ రాకేష్ డీఈవో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తుండగా, A2 చంద్ర శేఖర్ మీసేవ ఆపరేటర్ గా కొనసాగుతున్నారు.
ఒక్కొక్కరి వద్ద ₹ 5 వేల నుండి ₹ 60 వేల వరకు వసూలు చేశారని వివరించారు.
దాదాపు 57 మంది లబ్దిదారులను విచారించి గుర్తించామన్నారు. ఇప్పటి వరకు ₹ 4 లక్షలు అక్రమాలు జరిగినట్లు కొందరు ఫోన్ పే, నగదు ద్వారా చెల్లింపులు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్లు డిఎస్పి తెలిపారు.