కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !
J.SURENDER KUMAR,
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో 36 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సోమవారం ప్రకటనలో తెలిపారు.
మహిళలు, దివ్యాంగులు, మోడల్, యువతకు కోరుట్ల, జగిత్యాల , ధర్మపురి శాసన సభ నియోజక వర్గాలలో 36 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
👉 కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..
కోరుట్ల నియోజక వర్గంలోని ఇబ్రహీం పట్నం మండలంలో పోలింగ్ కేంద్రం నెం. 25 ను మహిళలకు, నెం. 47 ను మోడల్ పోలింగ్ కేంద్రంగా, మల్లాపూర్ మండలం లో పోలింగ్ కేంద్రం నేం. 56 మహిళలకు, మల్లాపూర్ మండలం లోని నెం. 66 కేంద్రాన్ని మోడల్ గా, కోరుట్ల మండలంలో పోలింగ్ కేంద్రం నెం. 147 మంది మహిళలకు, 97, 164 కేంద్రాలను మోడల్ గాను, 134 కేంద్రాలను యువతకు కేటాయించామని తెలిపారు. మెట్ పల్లి వారి 38, 200 కేంద్రాలను మహిళలకు, 236 ను దివ్యాంగులకు, 208 కేంద్రాన్ని మోడల్ గాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
👉 జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో..
జగిత్యాల శాసన సభ నియోజక వర్గం లో రాయికల్ మండలం పోలింగ్ కేంద్రం నెం. 39 మహిళలకు, 27 కేంద్రాన్ని మోడల్ గాను, బీర్పూర్ మండలంలో కేంద్రం నెం. 83 మహిళలకు, నెం. 67 మోడల్ కేంద్రంగా, సారంగాపూర్ మండలంలో పోలింగ్ కేంద్రం నెం. 101 మహిళలకు, నెం. 104 మోడల్ కేంద్రం గా, నెం.90 యువతకు కేటాయించామని తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 116 మహిళలకు, నెంబర్ 254 మోడల్ కేంద్రంగా, జగిత్యాల పట్టణంలో నెంబర్ 148 మహిళలకు, నెంబర్ 247 కేంద్రాన్ని దివ్యాంగులకు, నెంబర్ 155 మోడల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
👉 ధర్మపురి నియోజకవర్గంలో..
ధర్మపురి నియోజక వర్గంలో బుగ్గారం మండలంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 58 మంది మహిళలకు, నెంబర్ 57 మోడల్ కేంద్రంగా, ధర్మపురి మండలంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 31 మహిళలకు, 32 కేంద్రాలను దివ్యాంగులకు, ధర్మారం మండలంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 144 మోడల్ కేంద్రంగా, 162 కేంద్రాలను యువత కొరకు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎండపల్లి మండలం పోలింగ్ కేంద్రం నెంబర్ 97 మహిళలకు, గొల్లపల్లి మండలం పోలింగ్ కేంద్రం నెంబర్ 181 మహిళలకు, 210 కేంద్రాన్ని మోడల్ గా, పెగడ పల్లి మండలం పోలింగ్ కేంద్రం నెంబర్ 245 మహిళలకు, 253 కేంద్రాన్ని మోడల్ గా, వెల్గటూరు మండలంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 76 ను మోడల్ సెంటర్ గా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
.