జగిత్యాల్ లో 3722 డబుల్ బెడ్ రూమ్ లు మంత్రి కేటీఆర్ తో పంపిణీకి సిద్ధం!

👉 ఈనెల 3న జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో మంత్రి పర్యటన!

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణ పరిధిలోని  మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో  ₹ 280  కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మొదటి దశలో పట్టణంలోని 3722 మంది నిరుపేద లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ ఈనెల 3న పంపిణి కి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.

జగిత్యాల లో3722 డబుల్ బెడ్ రూములు.


అక్టోబర్ 3 న మున్సిపల్, ఐ.టి, శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు  జగిత్యాల,  ధర్మపురి శాసన సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదివారం ప్రకటనలో తెలిపారు. 

నూతన ఎస్పీ కార్యాలయం


అలాగే జిల్లా కేంద్రం లో నూతనంగా రూ. 38.4 కోట్లతో నిర్మించిన సమీకృత పోలీస్ కార్యాలయ భవనాన్ని మంత్రి కే.టి.ఆర్. ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.

ధర్మపురి లో మాతా శిశు సంరక్షణ కేంద్రం


జగిత్యాల పట్టణంలో రూ. 4.50 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్ – నాన్ వేజ్ మార్కెట్ ను మంత్రివర్యులు  ప్రారంభించ నున్నారని తెలిపారు.

జగిత్యాల సమీకృత మార్కెట్


అనంతరం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కే.టి.ఆర్. , సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం,

ధర్మపురిలో సెంట్రల్ లైటింగ్

పైలాన్ లను ప్రారంభోత్సవం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.  అలాగే గృహలక్ష్మి పథకం క్రింద లబ్దిదారులకు ఉత్తర్వుల కాపీలను మంత్రి పంపిణి చేస్తారని కలెక్టర్ తెలిపారు.