జాతీయ రహదారిపై ఇంటర్ డిస్టిక్ బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ భవనం ప్రారంభం!

👉 అసాంఘిక కార్యకలాపాలకు చెక్…

👉 హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం !

👉 పట్నం నుంచి రాయపట్నం చెక్ పోస్ట్ పర్యవేక్షణ!

👉 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా !

J.SURENDER KUMAR,

ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాల కు అనుసంధానంగా ఉండే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి నది తీరం రాయపట్నం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పోలీస్ బోర్డర్ చెక్ పోస్ట్, కమాండ్ కంట్రోల్ ను జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ శనివారం ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోకి ప్రవేశం ఉన్న అన్ని రహదారులపై బార్డర్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. అందులో భాగంగానే నూతనంగా నిర్మించిన రాయపట్నం చెక్ పోస్ట్ ప్రారంభించినట్టు వివరించారు.

నిరంతర నిఘా నీడలో..
రాత్రి పగలు ఇతర జిల్లాల నుండి రాకపోకలు కొనసాగించే వాహనాల తనిఖీలు ఉంటాయని ఇoదుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. డబ్బు మద్యం, అక్రమ కార్యకలాపాలు, రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. ఈ చెక్ పోస్ట్ కరీంనగర్ , జగిత్యాల, మంచిర్యాల మూడు జిల్లాలకు సరిహద్దు కావడంతో ఈ ప్రాంతం నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుందని గతంలో ఇక్కడ తాత్కాలికంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీ లు నిర్వహించేవారు

అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రత్యేక గదులతో మరొ అదనపు రూమ్ నిర్మించినట్లు ఎస్పీ వివరించారు.


హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కు సీసీ కెమెరాలు అనుసంధానం!
24 గంటలు సిబ్బంది విధులు నిర్వహిస్తారని, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు లక్షలాది రూపాయలు వ్యయంతో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరిగిందని కావున ఈ ప్రాంతంలో జరిగే ప్రతి సంఘటన కమాండ్ కంట్రోల్ ద్వారా చూడవచ్చన్నారు. ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని అదుపులో ఉంచేందుకు రోడ్డు మధ్యలో భారీ ఎత్తున బారికెట్లను ఏర్పాటు చేశామన్నారు. ఎలక్షన్ ల సమయం లొ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పట్లు చేస్తుంది అన్నారు.

ప్రజలు, యువత ఎలక్షన్ సమయం లో ఎలాంటి గొడవలకు పోకుండా పోలీసువారికి సహకరించాలని సూచించారు. ఈ చెక్ పోస్ట్ నిర్మాణంకు సహకరించిన స్థానిక ప్రజలకు దాతలకు ఎస్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్ చెక్ పోస్టు ఆవరణలో మొక్కలు నాటారు


ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఎస్పీ వెంకట స్వామి సి.ఐ రమణమూర్తి, ఎస్సైలు దత్తాత్రి, నరేశ్ , సందీప్, రామక్రిష్ణ, శ్వేత, సర్పంచ్ ఈర్ల చిన్నక్క, MPTC పుష్పాలత, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.