👉 రాష్ట్రంలో షాకింగ్ రాజకీయాలు!
J.SURENDER KUMAR,
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో సహాయ, సహకారాలు అందించని నాయకులు మీరు అంటూ, జాతీయ పార్టీకి నాయకుల పై ఉన్న ఆరోపణలు, విమర్శలు తుంగలో తొక్కి వారిని బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకిగా పురుడు పోసుకున్న ప్రాంతీయ తెలుగుదేశం పార్టీ, నాయకులను కాంగ్రెస్ జాతీయ పార్టీ వారు ఆహ్వానిస్తూ పదవులు కట్టబెడుతున్న తీరు రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన రాజకీయాలకు నిదర్శనం!
మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు, పొన్నాల లక్ష్మయ్య ను మంత్రి కేటీఆర్ శనివారం ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన విషయం విధితమే.
గతంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను ఇదే తరహాలో టిఆర్ఎస్ నాయకత్వం స్వాగతించి రాజ్యసభ సీటు అప్పగించారు.
మరో పిసిసి మాజీ అధ్యక్షుడు కేశవరావు ను ఇదే తరహాలో పార్టీలోకి ఆహ్వాని రాజ్యసభ కు నామినేట్ చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని. గులాబీ పార్టీలో చేర్చుకొని రాష్ట్రం లోఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
ప్రాంతీయ నుంచి..
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ లో మొదలైంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆ పార్టీ గుర్తుపై గెలిపించుకుంది. చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటుగా, ముద్ర పడిన మాజీ మంత్రి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ను బీఆర్ఎస్ నాయకత్వం పార్టీలో ఆహ్వానించి. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది.

చిత్రమైన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో క రుడుగట్టిన రాష్ట్ర సాధన ఉద్యమకారులు, కాంగ్రెస్ శ్రేణులు కంగు తింటున్నారు.