👉ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్
J.SURENDER KUMAR,
అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల నివేశన స్థలాల అంశం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు కోసం కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు.
విశాఖ అక్రిడేషన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు, కే.జి. రాఘవరెడ్డి, అధ్యక్షుడు బి రవి కాంత్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామచంద్రరావు, హౌసింగ్ సొసైటీ సలహాదారు డి రవికుమార్ , ఉపాధ్యక్షుడు డి మురళీకృష్ణ రెడ్డి, తదితరలు జర్నలిస్టులు, ప్రభుత్వ మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల అంశం ఉందని వివరించారు. జననేత పత్రిక సంపాదకులు దాసరి శివకుమార్ రెడ్డి, సిటీ రిపోర్టర్, ఎస్ నారాయణరావు, లీడర్ పత్రిక సంపాదకులు, రమణమూర్తి, సీనియర్ పాత్రికేయులు మంగు రాజగోపాల్, తదితరులు అమర్ ను కలసి పత్రికలు, జర్నలిస్టుల సమస్య తదితర అంశాలపై చర్చించారు.

సింహాచల స్వామి కి ప్రత్యేక పూజలు!
సింహాచలం శ్రీ స్వామి వారిని దేవులపల్లి అమర్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మోక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం అమర్ ను అర్చకులు, దేవాలయ అధికారులు, ఘనంగా స్వాగతించారు. వేద పండితులు ఘనంగా ఆశీర్వదించుగా ఆలయ ఏఈవో భ్రమరాంబ స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాన్ని అందించారు.

సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి. మణిరామ్, ఆలయ PRO నాయుడు, అమర్ వ్యక్తిగత సహాయకులు పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శారదా పీఠం దర్శనం!
శనివారం సాయంత్రం దేవులపల్లి అమర్ , వ్యక్తిగత సహాయకుడు పీ .రాజశేఖర్ పవిత్ర ప్రసిద్ధ శారద పీఠంను సందర్శించారు. పీఠాధిపతి శ్రీ శ్రీ స్వామీజీ నీ దర్శించుకున్నారు. అమర్ ను స్వామీజీ ఘనంగా ఆశీర్వదించి ప్రసాదం అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించారు.
