👉 కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
👉.ప్రచారాన్ని ప్రారంభించిన లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
మాజీ మంత్రి రత్నాకర్ రావు జయంతి సందర్భంగ నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి క్షేత్రంలో బుధవారం గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆవిష్కరించారు. రత్నాకర్ రావు తనయులు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు, ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారావు, కార్యక్రమంలో పాల్గొని లక్ష్మణ్ కుమార్ కు మద్దతుగా పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేశారు.

ముందుగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లక్ష్మణ్ కుమార్, ఆలయం ముందు రత్నాకర్ రావు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆలయం నుంచి నంది చౌక్, గాంధీ చౌక్ వరకు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, ఇంటింటికి , వ్యాపార సముదాయాలకు తిరుగుతూ కరపత్రలు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.

బిఆర్ఎస్ ప్రభుత్వం తన హామీలను కేవలం ప్రకటనలకే మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది తప్ప ఆచరణలో అమలు చేస్తున్నట్టు ఎక్కడ కనిపించడం లేదని, కాంగ్రెస్ పార్టీ హయంలోనే ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంట్ పైనే పెట్టడం జరిగిందని,

కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్యకుండా వడ్లను కొనుగోలు చేయడం జరిగిందని, కానీ ఈ ప్రభుత్వ హయాంలో రైతులను మిల్లర్లు దోపిడీకి గురిచేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం జరుగుతుందని, ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో పార్టీలకు అతీతంగా ఇల్లు మంజూరు చేయడం జరిగిందని,2022-23 ఆర్థిక సంత్సరంలో దళిత బంధు పథకం కింద 17,700 వందల కోట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ సమక్షంలో బడ్జెట్ ఆమోదం పొందినప్పటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదని, ధర్మపురి దేవస్థాన అభివృద్ధికి 5వందల కోట్లు ఇస్తానని చెప్పి 5 రూపాయలు కూడా ఇవ్వలేదని, ఆరోపించారు.

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,5 వందలకే సిలిండర్, రైతులకి క్వింటాలుకు అదనంగా 500 రూపాయల సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ప్రతి మహిళకు చేయూత కింద 4వేల రూపాయల ఆర్థిక సహాయం వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తుందని ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, LDM కోఆర్డనేటర్ శ్రీకాంత్, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, కౌన్సిలర్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్, బతికపెల్లి సర్పంచ్ శోభారాణి, బ్లాక్ కాంగ్రెస్ 1 అధ్యక్షులు కుంట సుధాకర్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, అసెంబ్లీ NSUI అధ్యక్షుడు అప్పం శ్రవణ్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నర్సగౌడ్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు