కరీంనగర్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ బదిలీ వేటు వెనుక…

J.SURENDER KUMAR,

కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌ సుబ్బరాయుడిని, కలెక్టర్ గోపి బదిలీ వేటు వేస్తూ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వుల వెనుక అనేక కారణాలతో పాటు జర్నలిస్టులపై అక్రమంగా నమోదు చేసిన కేసులు మరో ప్రధాన కారణం.

ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కరీంనగర్ పట్టణంలో అధికార పార్టీ కీలక నేతలు కొందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ ను ఇచ్చారు. లబ్ధిదారులలో కొందరు జర్నలిస్టులు కాదని ? వారికి జర్నలిస్టుల కోటాలో ఇళ్ల స్థలాల పట్టాలు ఎలా ఇస్తారంటూ ? జర్నలిస్టుల సంఘాల నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోపాటు. జర్నలిస్టులు కాని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతాలను కొందరు పాత్రికేయులు తాము పనిచేస్తున్న పత్రికలలో వార్తా కథనాలు ప్రచురించారు.
అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం జిల్లా కేంద్రంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటికి పోలీసులను పంపించి కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, జర్నలిస్టును బలవంతంగా పోలీస్ జీప్ లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటలపాటు స్టేషన్ ఆవరణలో నిర్బంధించారు. దీంతోపాటు ఇదే అంశంపై ప్రశ్నించిన మరో ఇద్దరు జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు.
దీనికి తోడు పట్టణంలో జరిగిన ఓ వర్గం ర్యాలీ, ద్విచక్ర వాహన ప్రమాదం, తదితర సంఘటనలు, అంశాల నేపథ్యంలో బిజెపి నాయకత్వం, ఈ నెల 18న ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… పోలీస్ కమిషనర్‌ను  అదేవిధంగా పలు కారణాల రీత్యా కరీంనగర్‌ కలెక్టర్‌ గోపీ ని కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.