J.SURENDER KUMAR,
గుజరాత్ మినరల్స్ తరహాలో సింగరేణికి కూడా మైన్స్ కేటాయించమని కోరితే.. మోదీ మొండి చేయి చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోదీ.. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చిండో చెప్పాలని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం అనే పరిస్థితి ఉందన్నారు.
ఆదివారం మంచిర్యాల పర్యటన ముగించుకొని పెద్దపల్లి జిల్లాకు వచ్చిన ఆయన రామగుండంలో సింగరేణి భూనిర్వాసితులకు పరిహార పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రభుత్వ ఉత్తర్వులను అందిస్తూ ప్రధాని మోడీ తీరుపై ఆరోపించారు.
గత ప్రభుత్వాల పాలనలో సింగరేణి కార్మికులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని.. సంస్థ లాభాల్లో వాటా కింద కేవలం 18 శాతం మాత్రమే ఇచ్చేవారని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 42శాతం వాటా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించినట్లు గుర్తు చేశారు.
కార్పొరేట్ కంపెనీలకు వంత పాడుతున్న ప్రధాని మోదీ.. ప్రభుత్వ సంస్థలను తన దోస్తులకు అగ్గువకే కట్టబెడుతూ చందాలు తీసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని అమ్మబోమని తెలంగాణలో హామీ ఇచ్చిన మోదీ.. దిల్లీకి వెళ్లగానే సంస్థ నాలుగు గనులను వేలానికి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా.. వేలం పాటలో పాల్గొనమని ఉచిత సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వాల పాలనలో సింగరేణి కార్మికులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని.. సంస్థ లాభాల్లో వాటా కింద కేవలం 18 శాతం మాత్రమే ఇచ్చేవారని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు బీఆర్ఎస్ హయాంలో.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 42శాతం వాటా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించినట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.