J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ ధర్మపురి అసెంబ్లీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో సోమవారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ధర్మపురి పట్టణానికి చెందిన సోషల్ మీడియా వారియర్ వెల్ముల వినయ్ (చిక్కి) పట్టణ టాటాఎసి యూనియన్ అధ్యక్షులు షౌకత్,.మరియు గట్ల వినీత్ లకు లక్ష్మణ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్ , నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, టౌన్ బిసి సెల్ అధ్యక్షులు వోజ్జల లక్ష్మణ్, రవి, రమణ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, టౌన్ యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి, సుముక్, చిలుముల రవీందర్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ !

ధర్మపురి మండలం బోధర గూడెం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొగిలి, సుముక్, నర్సింహులు,మాజీ ఎంపీటీసీ సరెందర్ తదితరులు పాల్గొన్నారు