మహా చండీయాగంలో పాల్గొన్న మంత్రి కొప్పుల దంపతులు !

J.SURENDER KUMAR,

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ జయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం మహా చండీ యాగం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ దంపతులు కుటుంబ సమేతంగా యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ తో పాటు వందలాది మంది భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యాగం కార్యక్రమం తిలకించెందుకు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్షణ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లోచేరికలు..


ధర్మపురి నియోజకవర్గం ఆరెపల్లి గ్రామానికి చెందిన మహేష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు కరీంనగర్ మంత్రి ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామ అభివృద్ది కోసం వారు చేరినట్టు ప్రకటనలలో పేర్కొన్నారు.