మాజీ ఎంపీ వివేక్ పార్టీ మార్పిడి పుకార్లకు చెక్ !


👉ఆదిలాబాద్ సభలో అభినందించిన హోం మంత్రి అమిత్ షా!


J.SURENDER KUMAR,

పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ఎన్నికలలో బిజెపి పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ వివేక్ పార్టీ మారుతాడు అనే పుకార్లకు చెక్ పడింది.
వివరాల్లోకి వెళ్తే.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంగళవారం తెలంగాణ పర్యటనలో భాగంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభ లో పాల్గొని ప్రసంగించారు. సభా వేదిక పై వెనక వైపు కూర్చున్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి, అమిత్ షా ప్రత్యేకంగా పిలిచి ముందుకు రా అంటూ జనసమూహం ముందు నిలబెట్టి చప్పట్లతో స్వాగతిస్తూ అభినందించారు.
సభానంతరం పార్టీ అగ్ర నాయకులు, కీలక నాయకుల ముందు మీరు వివేక్ ను ఎంపీగా గెలిపించండి. కేంద్రంలో నేను చూసుకుంటాను అని అన్నట్టు పార్టీ శ్రేణుల లో జోరుగా చర్చ నెలకొంది. కొంత కాలంగా వివేక్, రాజకీయ ప్రత్యర్థులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో త్వరలో వివేక్ చేరుతారని, సోషల్ మీడియాలలో, కొన్ని ప్రచార మాధ్యమాలలో. నిరాధార కథనాలు ప్రచురించారు. అనేక సందర్భాల్లో మాజీ ఎంపీ వివేక్ తాను పార్టీ మారడం లేదంటూ బిజెపి వీడేది లేదు నాపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని పలుసార్లు ఖండించిన ఆయన అర్ధనాదం అరణ్య రోదనగా మారింది. . కొంతకాలంగా. మానసిక వేదన అనుభవిస్తున్న వివేక్ కు అమిత్ షా అభినందనలతో ఊరట లభించింది అనే చర్చ. ఆదిలాబాద్ లో అమిత్ షా సభతో రాజకీయ ప్రత్యర్థుల నోళ్లకు తాళం పడిందనే చర్చ బిజెపి శ్రేణులలో నెలకొంది
.