👉అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా..
*********
ఆధునిక కాలంలో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ర్ అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇప్పుడు వయసు తో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది. మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి.
శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమే. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపు తప్పకుండా పనిచేస్తుంది. అలాంటి మెదడులో చిన్న సమస్య తలెత్తినా ‘బ్రెయిన్ స్ట్రోక్’ ఏర్పడుతుంది. అదే ‘పక్షవాతం’. దీని వల్ల శరీరంలోని అవయవాలు అదుపు తప్పుతాయి. ముఖ్యంగా కాలు, చేతులు పనిచేయకుండా పోతాయి.
గుండె శరీరానికి మరో ప్రధాన అవయవం. దీని వల్లే మానవుడు జీవించగలుగుతాడు. అయితే ఇటీవల కాలంలో గుండె పోటు వచ్చి చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతుంది. ఈ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటు బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మనిషిని ఇబ్బంది పెట్టే సమస్యలలో పక్షవాతం ఒకటి. పక్షవాతంలో రెండు రకాలున్నాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్.

మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడిపోతాయి. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని రక్తనాళాలు చిట్లినప్పుడు అంతర్లీనంగా రక్తస్రావం జరుగుతుంది. దీన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. పక్షవాతం ఎక్కువగా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని అంటారు. దురలవాట్లు, దీర్ఘకాలిక వ్యాధులే ఇందుకు కారణం. దూమపానం, మద్యపానం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. ఇక డయాబెటీస్ (మధుమేహం), రక్తపోటు, స్థూలకాయం సమస్యలుంటే.. పక్షవాతం పొంచివున్నట్లే. చాలామందిలో 50 ఏళ్ల వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వయస్సు మీదపడిన తర్వాత ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇటువంటి సమస్యలపై అవగాహన పెంచేందుకు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రతి ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే ని జరుపుతుంది. అంతిమంగా ఇటువంటి సమస్యలు ఎవరికైనా వస్తే ,ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి వైద్యులని కలవాలి. అదే విధంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
వ్యాసకర్త!
యం.రాం ప్రదీప్ జేవివి సభ్యులు, తిరువూరు
మొబైల్ 9492712836