👉 జగిత్యాల పట్టణంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి మంగళవారం 3న మంత్రి కే తారక రామారావు విచ్చేస్తున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు పోలీస్ యంత్రాంగం విధించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
🔜 భారీ వాహనాల ట్రాఫిక్ డైవర్షన్.
👉 కరీంనగర్ నుండి కోరుట్ల వైపు వెళ్లే వాహనాలు పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళవలసి ఉంటుంది.
👉 ధర్మపురి వైపు నుండి కోరుట్ల, కరీంనగర్ వైపు వెళ్లేవారు తమ వాహనాలను పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.
👉 కోరుట్ల వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులు Chelgal బైపాస్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

🔜 జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు!
👉 ఓల్డ్ బస్టాండ్ నుంచి గొల్లపల్లి వెళ్లేవారు వయా చిన్న కెనాల్ బైపాస్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.
🔜 సమావేశానికి వచ్చే వాహనాల పార్కింగ్!
👉 కోరుట్ల, రాయికల్ నుండి వచ్చేవారు వాహనదారులు న్యూ బస్టాండ్ మీదుగా వచ్చి ఓల్డ్ బస్టాండ్ వద్ద ప్రజలను దింపి మిషిన్ కంపౌండ్ /SKNR డిగ్రీ కాలేజీలో వాహనాలను పార్కింగ్ చేసుకోవలసి ఉంటుంది.
👉 కరీంనగర్, మల్యాల వైపు నుండి వచ్చేవారు న్యూ బస్టాండ్ మీదుగా వచ్చి ఓల్డ్ బస్టాండ్ వద్ద ప్రజలను దింపి తమ వాహనాలను మిషన్ కాంపౌండ్/SKNR డిగ్రీ కాలేజీలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవలసి ఉంటుంది.
👉 ధర్మపురి, సారంగాపూర్ నుండి వచ్చే వాహనదారులు ఓల్డ్ బస్టాండ్ వద్ద ప్రజలను దింపి తిరిగి తమ వాహనాలను మిషన్ కాంపౌండ్/SKNR డిగ్రీ కాలేజీలో పార్కింగ్ చేసుకోవలసి ఉంటుంది.
👉 గొల్లపల్లి వైపు నుండి వచ్చే వాహనదారులు గొల్లపల్లి బైపాస్ ఎక్స్ రోడ్ వద్ద ప్రజలను దింపి తిరిగి మోతే పార్టీ ఆఫీస్ పక్కన గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవలసి ఉంటుంది.