J.SURENDER KUMAR,
రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేపట్టిన ఎన్నికల ప్రచార వాహనంపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమవారం రాత్రి చెప్పుతో దాడి చేశాడు.
కరీంనగర్ రూరల్ మండలం. గోపాల్ పూర్. గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎల్ఈడి స్క్రీన్ గల ప్రచార వాహనం లో. మంత్రి గంగుల కమలాకర్ చిత్రం అనిపించగానే ఉపాధ్యాయుడు దుర్భాషలాడుతూ చెప్పుతో స్క్రీన్ పై కొట్టాడు.

జిల్లా ప్రజాపరిషత్ దుర్శెడ్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉపాధ్యాయుడు జగదీశ్వరాచారి తన చెప్పుతో దాడి చేశారు. అసభ్యకరంగా దుర్భాషలాడినట్లు సమాచారం. ఈ సంఘటన పై ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చెప్పుతో దాడి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.