J.SURENDER KUMAR,
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించి వారంతా చదువు పై దృష్టి సారించడమే లక్ష్యంగా మరో మానవీయ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేతలతో కలిసి ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మంత్రి వివరించారు.