మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి దుర్మార్గమైన చర్య !

👉 మంత్రి కొప్పుల ఈశ్వర్..

J.SURENDER KUMAR,

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో ఎన్నికల ప్రచారం  నిర్వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా తో మాట్లాడారు.

ప్రజాక్షేత్రంలో బీఆర్ ఎస్ పార్టీ ని ఎదుర్కో లేకనే కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడటం మొదలు పెట్టిందాన్నారు. హత్యా రాజకీయాలు సమాజానికి మంచిది కాదని…ప్రజలను ఒప్పించి.. మెప్పించి ఓట్లు అడుక్కోవాలని సూచించారు. దాడులు చేసి భయోత్పతం సృష్టించు కోవాలను కోవడం ఎవరూ క్షమించరని అన్నారు. తెలంగాణ లో ఎలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. శాంతి యుతంగానే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే  కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగిందన్నారు. ఘటన జరిగి 24 గంటలు గడిచిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ ఖండించలేదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆగడలను కట్టడి చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నెత్తుటి మరకలు పూస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొప్పుల జోష్యం చెప్పారు.


బీఆర్ఎస్ లో చేరిక


ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.


ధర్మపురి పట్టణం లోని 7.వ వార్డు (మిఠాయి వాడ) నుండి పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.