J.SURENDER KUMAR,
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కల్పించిన వెసులుబాటుతో మీ ఓటర్ ఐడీ కార్డును మీరే స్వయంగా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్ ఐడీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొని ఫిజికల్ కార్డు తక్షణ అవసరం ఉన్నవారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త ప్రకటించింది.
ఈ-ఓటరు గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్)ను మొబైల్, లేదా ల్యాప్‌టాప్, కంప్యూటర్ సాయంతో సులువుగా ఆన్లైన్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌లో పలు కీలక మార్పులు చేసింది. తాజాగా తెచ్చిన ఈ విధానంలో మొబైల్ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఓటు హక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆన్లైన్లో ఈ-ఓటరు ఐడీని ఇలా పొందవచ్చు!
👉 ముందుగా NVSP పోర్టల్ https://voters.eci.gov.in/లోకి లాగిన్ అవ్వాలి.
👉 తర్వాత హోమ్ పేజ్‌లో ఉన్న ‘E-Epic Download’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
👉 అనంతరం స్క్రీన్‌పై అడిగే విధంగా మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ లేదా EPIC నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.
👉 తరువాత ‘Request OTP’పై క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది.
👉 ఈ OTPని నిర్దేశించిన బాక్స్‌లో నమోదు చేయాలి.
👉 చివరగా డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు ‘Download e-EPIC’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
👉 దీంతో మీరు ఇంట్లో కూర్చొనే సులువుగా ఓటర్ ఐడీని పీడీఎఫ్ ఫార్మాట్లో పొందవచ్చు.
👉 ఒకవేళ ఫిజకల్ కార్డు కావాలనుకునే వారు దగ్గర్లోని మీ-సేవా లేదా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి ఓటర్ ఐడీ కార్డును భౌతికంగా పొందవచ్చు.
పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండే ఈ-డిజిటల్ ఓటర్ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగానే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది.