👉 ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి!
👉 ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి!
👉 ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్!
J.SURENDER KUMAR,
భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
సోమవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ , శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఎస్పి భాస్కర్, అదనపు కలెక్టర్లు. బిఎస్సి లత మరియు దివాకర్ లతో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ,
ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించండి !
భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 కు షెడ్యూల్ విడుదల చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు , వాల్ రైటింగ్స్ తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని, ప్రైవేట్ స్థలాలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ఫస్ట్ కమ్ ఫస్ట్ !
రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్, జిల్లా వెబ్ సైట్ లలో పొలిటికల్ ఫంక్షనరీస్ ఫోటో లను తొలగించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు.
నవంబర్ మూడు లోపు నివేదిక అందించాలి!
నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలని అన్నారు.
ప్రతిరోజు నివేదిక!
రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదే రోజు అందించే విధంగా ఎంసిఎంసి పని చేయాలని అన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ లు ప్రతి రోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి!
జిల్లాలో దివ్యాంగుల ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు , ఇతర ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు సేకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

లైటింగ్ ఏర్పాటు చేయాలి !
పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, లైటింగ్ ,ర్యాంపు, నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.
రిటర్నింగ్ అధికారులకు భద్రత కల్పించాలి!
నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే సమయంలో నిబంధనలు పాటిస్తూ నామినేషన్ లో అన్ని అంశాలు నింపారో లేదో చెక్ చేసుకోవాలని, నింపని పక్షంలో సదరు అభ్యర్థులకు రాత పూర్వకంగా సమాచారం అందించాలని అన్నారు
ఓటింగ్ స్లిప్పుల పంపిణీ!
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రతినిధులు ప్రభుత్వ మిషనరీ ఎన్నికల కోసం వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, ఓటింగ్ స్లిప్పుల పంపిణీ నామినేషన్ల ముగింపు తేది అనంతరం నుంచి చేపట్టాలని అన్నారు.
ఈ విడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ లు. నరసింహ మూర్తి. రాజేశ్వర్ డీఎస్పీలు . వెంకటస్వామి. రవీందర్ రెడ్డి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ .DRDA నరేష నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.