అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు..

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ !


J.SURENDER KUMAR,

పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమంలో  స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని  జగిత్యాల  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , అన్నారు.

ఇందులో భాగంగా
ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు మొదలగునవి  విషయాలను ప్రజలకు తెలియపరచడానికి ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు నిర్వహించ నున్నట్టు పేర్కొన్నారు.
👉 ఆన్లైన్ లో  https://forms.gle/b7bejvzfo6j29Vuz6  ఈ వెబ్ సైట్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును.
వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా
👉 కేటగిరి-1: స్టూడెంట్స్ కు  ఇంటర్మీడియట్  వరకు use of technology for effective policing, (సమర్థవంతమైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం)
👉 కేటగిరి-2:  డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ కు role of police in combating misuse of social media (సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం లో పోలీస్ పాత్ర)
అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 28 అక్టోబర్ 2023 వరకు సమర్పించవచ్చును.
ప్రతిభ కనబరిచిన ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
👉 పోలీసులకు వ్యాసరచన పోటీలు
👉 కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు పోలీసులకు పని -జీవిత సమతుల్యత.
👉 కేటగిరి-2: ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు సమాజం లో లింగ సమానత్వాన్ని కాపాడడం లో పోలీస్ పాత్ర. వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు.ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు.
👉 రక్తదాన శిబిరాలు
రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది.
👉 షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు:
జిల్లా పరిధిలో విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు మించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఫోటోలు, వీడియోలు ఈనెల తేది: 23-10-23 లోపు  సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందించాలి.
👉 ఈ నెల 21వ తేదీ నుండి  31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
👉 స్మృతి పరేడ్
ఈ నెల అక్టోబర్ 21న జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో  “పోలీస్ అమరవీరుల కు ఘనంగా నివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్” నిర్వహించడం జరుగుతుందని  ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు.