ఒక్కసారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి చేస్తాం!

👉అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆరు కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు..


👉 ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..


J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణంలోని 2 వ వార్డు లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సోమవారం కాంగ్రెస్ ఆరు గ్యారంటీ ల పై ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ కు ఓటు వేయండి..ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తాం..
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెలా ₹ 2500, ఇవ్వడం తోపాటు సిలిండర్ ₹.500 లకే ఇస్తాం.. మహిళలకు ఆర్ టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తాం.
రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీతో పాటు ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు రైతుబంధు పథకం కింద ₹15,000 అందిస్తాం..
వ్యవసాయ కూలీలకు ₹12,000 అందిస్తాం.
వరి ధాన్యం మద్దతు ధరపై అదనంగా క్వింటాల్కు ₹500 బోనస్ కల్పిస్తాం.
చేయూత పథకం కింద పెన్షన్ ₹ 4000 అందిస్తాం రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల ఉచిత వైద్య సౌకర్యం..గృహ జ్యోతి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం. కల్పిస్తాం


ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తాం తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాం..
యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు ఉన్నత చదువుకునేందుకు ₹ 5 లక్షల ఆర్థిక సహాయం కల్పిస్తాం..
కేంద్రం పై రాష్ట్రం.. రాష్ట్రం పై కేంద్రం నెపం నెట్టి సామాన్యుల పై సిలిండర్ ధర పెంచిన భారం వేశారు అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని భావిస్తే కనీసం ఖాళీలు కూడా భర్తి చేయడం లేదు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అంగట్లో సరుకులు అయ్యాయి..
ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు..ఒక్కసారి కూడా డీ ఎస్సీ నిర్వహించలేదు. అని జీవన్ రెడ్డి విస్తృత స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయమని అభ్యర్థించారు.