15 న ధర్మపురి లో మాదిగల విశ్వరూప యాత్ర ప్రారంభం!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆరికిల్ల సతీష్ , అధ్వర్యంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎస్సిలలోని మాధిగ ఉపకులాలకు సంపూర్ణ న్యాయం జరగాలన్న సంకల్పంతోనే చేపట్టిన మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర ఈ నెల 15 నుంచి ధర్మపురిలో ప్రారంభించాలని తీర్మానించారు.


ముఖ్య అతిథులుగా మాదిగ ఎంప్లాయ్ ఫెడరేషన్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాండ్ర నర్సయ్య, ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం, పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 9 ఏండ్లుగా ఎస్సి వర్గీకరణపై నాన్చుడు ధోరణి చేపట్టిందన్నారు. గత తొమ్మిదేండ్లుగా తెలంగాణలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో మాదిగ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. తక్షణమే ఎస్సి వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సి వర్గీకరణ సాధనే లక్ష్యంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి మహపాదయాత్రతో పల్లెపల్లెన మాధిగలను మరొ పోరాటానికి సిద్ధం చేస్తామని వారు అన్నారు. ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, ధర్మపురి నియోజికవర్గ ఇంఛార్జి దికొండ మహేందర్, ఎంఎస్పి జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి బొనగిరీ కిషన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బాలారపు పోచయ్య ,పట్టణ ఇంఛార్జి పులి ప్రేమిత్, బుగ్గరం మండల ఇంఛార్జి చిర్ర లక్ష్మణ్ , చెందోలి శ్రీనివాస్ రాజ శేకర్ శ్రీకాంత్, విష్ణు , సాయి రాజ్, లచ్చన్న అశోక్, శంకర్, అంజయ్య, రోహిత్, సతీష్ గంగాధర్, సురేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు