పంచముఖాలతో గాయత్రీదేవిగా దర్శనం!

👉జగిత్యాలలో వైభవంగా సామూహిక కమలార్చన!

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో శ్రీ గాయత్రీ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి.

మంగళవారం హరిద్రా గణపతి పూజ, నిత్య పూజ, మంగళహరతి, మంత్ర పుష్పం, సాయంత్రం సామూహిక కమలార్చన వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం కార్యనిర్వాహక సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.