👉 ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ..
J.SURENDER KUMAR,
కోవిడ్ (కరోనా) తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది అని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ అన్నారు. కొవిడ్ తర్వాత పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయని.. అందుకే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో లాభదాయకమని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
తెలంగాణకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ములుగు జిల్లాలో ₹ 900 కోట్లతో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు చూపించే ప్రేమాభినాలకు ధన్యవాదాలు అని మోదీ అన్నారు.
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని మోదీ గుర్తు చేశారు. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగిందని వివరించారు.
దేశంలో పండగల సీజన్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణలో ₹13,500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. కేంద్రం చేపట్టిన ఈ పనులతో.ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల చట్టం తెచ్చుకున్నామని అన్నారు. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు.

ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని పేర్కొన్నారు. హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో.. వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోదీ వెల్లడించారు.
13, 500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 163- జాతీయ రహాదారిలో భాగమైన వరంగల్ నుంచి ఖమ్మం.. ఖమ్మం నుంచి విజయవాడకు నాలుగు వరుసల రహదారికి, కృష్ణపట్నం- హైదరాబాద్ మధ్య మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్‌కు మోదీ రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ₹ 2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం 4వరుసల రహదారిని, ₹ 505 కోట్లతో నిర్మించిన 37.48 కిలోమీటర్ల జక్లేర్-క్రిష్ణా నూతన రైల్వే మార్గాన్ని మోదీ జాతికి అంకితం చేశారు.
₹2,661 కోట్ల హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ₹ 81.27 కోట్లతో నిర్మించిన భవనాల్ని వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. అనంతరం వీడియో ద్వారా కృష్ణా రైల్వే స్టేషన్‌లో ఉన్న కాచిగూడ-రాయిచూర్ రైలును మోదీ జెండా ఉపి ప్రారంభించారు.