పత్రికలు న్యూస్ ఛానల్ లో వార్తలను నిశితంగా పరిశీలించాలి !

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !

J.SURENDER KUMAR,

దిన పత్రికలు, న్యూస్ చానళ్ళు, సోషల్ మీడియా లలో వచ్చే వార్తలను పరిశీలించాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థుల ప్రచార వార్తలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ( M C M C ) పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

జగిత్యాల కలెక్టరేట్ భవనంలో శుక్రవారం ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని పరిశీలించి, MCMC సభ్యులకు అందిస్తున్న శిక్షణ ను పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, MCMC సభ్యులు పేడ్ న్యూస్, వార్తలు పరిశీలన చేయాలని ప్రకటనల (Aadvertisements) ప్రచురణకు ముందస్తు అనుమతి MCMC నుండి పొందవలసి ఉందన్నారు. అంతకు ముందు మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సమాచారాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, DPRO ఎన్.భీమ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ఎస్. శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్. శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.శ్రీనివాస్ రావు, EDM మమత, రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ లు సుధీర్, పి.తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ !


శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారిని, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, పరిశీలించారు.