👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !
J.SURENDER KUMAR,
తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందికి ఈ నెల 30,31 తేదీలలో మొదటి శిక్షణ తరగతు లను నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాలలో పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించనున్న పోలింగ్ సిబ్బందికి సోమ, మంగళవార లలో శిక్షణ మొదలవుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
👉 జగిత్యాల లోని ఎస్.కె. ఎన్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో
👉 ధర్మపురి లోని ఎస్.టి. బాలుర వసతి గృహంలో
👉 కోరుట్ల లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో
శిక్షణ తరగతులు ఆయా శిక్షకులతో ఇవ్వడం జరుగు తుందని తెలిపారు. ఇట్టి శిక్షణలోఆయా సిబ్బందికి ఉదయం, మధ్యాహ్నం సమయాలలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నియమించబడిన సిబ్బంది తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.