పోస్టల్ బ్యాలెట్ వినియోగ అర్హులు వీరే..

J.SURENDER KUMAR,

అవసరమైన ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కొనుటకు భారత ఎన్నికల కమీషన్ అనుమతించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, వివిధ మాధ్యమాలలో పనిచేస్తున్న 13 అత్యవసర సర్వీస్ శాఖల్లోని ఉద్యోగులు వారి ఓటుహక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కొనుటకు 12 డి ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

👉.భారత ఏర్ పోర్ట్ అథారిటీ,

👉 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,

👉 భారత రైల్వే,

👉 ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో,

👉 దూరదర్శన్,

👉 ఆలిండియా రేడియో

👉 విద్యుత్ శాఖ,

👉 ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ,

👉 రాష్ట్ర రవాణా సంస్థ,

👉 ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్,

👉 BSNL, పోలింగ్ రోజున కవరేజీ చేసే మీడియా ప్రతినిధులు ( భారత ఎన్నికల కమీషన్ ఆథరైజేశన్ పొందిన వారు) ,

👉 అగ్నిమాపక సర్వీసులు వంటి శాఖలలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన ఓటు హక్కు వినియోగించు కొనుటకు నిర్ణీత ప్రోఫార్మ లో నవంబర్ 8లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

ఆయా శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది దరఖాస్తులను నోడల్ అధికారులుగా నియమించబడిన అధికారులకు 12డి ఫారం లను ఆయా అధికారులు పరిశీలించి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా ప్రతినిధులకు సంబంధించిన 12 డి ఫారాలను జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల కు అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఉద్యోగి వినియోగించు కోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.