J.SURENDER KUMAR,
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వివరణ కోరినట్టు సమాచారం.
ఎన్నికల వేళ.. కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో.. ప్రగతిభవన్‌ను పార్టీ పనుల కోసం వినియోగించకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లుగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు ఇస్తున్నారని.. ఇది ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సైతం రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈ అంశంపై వివరణ తీసుకోవాలని జీహెచ్ఎమ్సీ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌ను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రగతిభవన్‌లో రోజువారీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న ఓ ఉద్యోగికి నోటీసు పంపినట్లు సమాచారం.