ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తాం !

ఎస్పీ , సన్ ప్రీత్ సింగ్ !

J.SURENDER KUMAR,

ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్చాయుత గా ప్రజలు ఓటు హకు ను వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా స్థితిగతులను, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గూర్చి అధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ…
జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామనీ, నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ఉండదని పేర్కొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటానన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వ్యక్తులను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెట్టరాదని, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ప్రలోభాల గురిచేసిన, భయభ్రాంతులకు గురి చేసిన జిల్లా పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం అందిస్తే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు