J.SURENDER KUMAR,
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో గురువారం ప్రారంభోత్సవాలు భూమి పూజల కార్యక్రమాలతో సుడిగాలి పర్యటన చేశారు.

ధర్మపురి మండలం రాయపట్నంలో సొసైటీ నిధులు ₹ 39 లక్షల తో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల గోదాం ను ప్రారంభించి, అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹ 20 లక్షల గ్రామ పంచాయతీ భవనం, ₹ 5 లక్షల తో ఎస్పీ మాదిరి కుల సంఘ భవనం, ₹ 38 లక్షల 42 వేల తో నిర్మించిన కో ఆపరేటివ్ భవనం శంకుస్థాపన ప్రారంభించి,

బతుకమ్మ చీరల ను లబ్దిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.అనంతరం గ్రామం లో మాల సంఘం సభ్యులు మూకుమ్మడిగా పార్టీ కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలో ₹ 30 లక్షల తో నిర్మించిన శారద మహిళ భవనం, నాక్ సెంటర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు మంత్రి కొప్పుల దంపతులను ఘనంగా సన్మానించారు.