👉 జగిత్యాల డి .ఎస్పి వెంకటస్వామి !
J.SURENDER KUMAR,
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ ల పాత్ర చాలా కీలకమైందని డిఎస్పీ వెంకటస్వామి అన్నారు.
జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లొ రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులు తీసుకోవలసిన చర్యలపై మాస్టర్ ట్రైనర్ పడల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలొ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.

ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్ సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని .ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.
ఈ యొక్క శిక్షణ కార్యక్రమo లో ఇన్స్పెక్టర్లు నటేష్, ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్.ఐ లు జగిత్యాల సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.