పునరావాస గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం!

👉 లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..


J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం దొంతాపూర్, పునరావాస గ్రామాలైన మగ్గిడి, ఎడపెల్లి గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా
ఎడపెల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ..


ధర్మపురిలో మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప, మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి అంటు ఏమి లేదని, రైస్ మిల్లర్లు క్వింటాలకు 5 నుండి 8 కిలోల వరకు కటింగ్ పేరిట దోపిడీ చేస్తున్న మంత్రి కనీసం రైతుల పక్షాన మాట్లాడలేదని, ఆరోపించారు. దళితబందు వారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు తప్ప,అర్హులైన పేదవారికి ఇవ్వలేదని, లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేశారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, రాజేందర్, శేఖర్, సాయి, గంగాధర్, తిరుపతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

వెలుగట్టురు కాంగ్రెస్ శ్రేణులు బైక్ ర్యాలీ !


వెలగటూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు సోమవారం బైక్ ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ను . బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతించారు.
ధర్మపురి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ AICC ప్రకటించిన సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు.

రాజరాంపల్లి వద్ద మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు, రాజరాంపల్లి నుండి వెల్గటూర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.


తన మీద నమ్మకంతో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర,రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి ,మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుదరీ రమేష్,

స్థానిక సర్పంచ్ మురళి గౌడ్, ఎంపిటిసి రంగు తిరుపతి, శ్రీకాంత్ రావు, సందీప్ రెడ్డి, కుమారస్వామి, గొల్ల తిరుపతి, ఉదయ్, గుమ్ముల వెంకటేష్ , సత్యనారయణ రావ్, సత్యం ,పోచయ్య, బైరం రెడ్డి, బిసగోని సత్యం, లింగారెడ్డి, బల్సాని మల్లేశం ,నల్ల తిరుపతి, పోలోజు శ్రీనివాస్, సోమిసెట్టి రమేష్, గాజుల విజయ్ ,గెల్లు శ్రీనివాస్, పత్తిపాక శ్రీధర్, సాగర్, మహేష్, నేరెళ్ళ రమేష్ , జనార్ధన్ ,వడకపురం రవి, యాదగిరి అప్సరు, శంకరయ్య ,రాజు ,హరీష్, శశి, శ్రీధర్ , వినోద్, రాకేష్ సురేష్ హరీష్ , సంజీవ్ మహేష్ , గాజుల, లక్ష్మణ్ రవి, రాజయ్య, సాయి. అశోక్ తదితరులు పాల్గొన్నారు