రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి !

👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

J.SURENDER KUMAR,

రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్చాయుత వాతావణంరంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయం లోని మీటింగ్ హాల్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమీషన్ షెడ్యుల్ ప్రకటించడం జరిగిందని, కమీషన్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ అమలులోకి రావడం జరిగిందని అన్నారు.

👉 వచ్చే నెల 3 వ తేదిన నోటిఫికేషన్ ప్రకటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని,
నవంబర్ 10 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని,
👉 నవంబర్ 13 న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 15 వరకు అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీ అని తెలిపారు. నవంబర్ 30 న పోలింగ్ నిర్వహించడం జరుతుగుందని అన్నారు.
👉 డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.


👉 గత అక్టోబర్ 4 న ప్రకటించబడిన రెండవ ఎస్.ఎస్. ఆర్. జాబితా ప్రకారం జిల్లాలోని కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో 6,87,952 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటరు జాబితాలో ఓటరు నమోదు చేసుకోవడానికి ఈ నెల 31 తో ముగిసిపోతున్నదని తెలిపారు.
👉 తొలగించబడిన ఓటర్ల వివరాలను మదర్ రోల్ లో డిలిషన్ అని గుర్తించడం జరుగుతుందని తెలిపారు. అట్టి జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఉచితంగాను, ఇతర పార్టీల వారికి జాబితాల కోసం నిర్ణిత డబ్బు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.


👉 ఓటరు ఇన్ఫర్మేన్ స్లిప్పులను ఆయా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి పంపిణి చేయడం జరుగుతుందని,
👉 ఈ ప్రక్రియ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు, దివ్యాంగులకు, వయో వృద్ధులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
👉 జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల లోకేషన్లు మార్చడం జరిగిందని, అట్టి వివరాలను రాజకీయ పార్టీల వారికీ అందించడం జరిగిందని, ఆయా పార్టీల వారు సంబంధిత ఓటర్లకు తెలియపరిచి సహకరించాలని కోరారు. ఇప్పటివరకు అందించిన సహకారంతో పాటు రానున్న పోలింగ్ సమయంలో కూడా సహకరించాలని అన్నారు.


👉 జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు పరుస్తున్నామని, అక్రమ నగదు, మద్యం రవాణా ను అరికట్టడానికి ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి టీం లు నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతున్నాయని అన్నారు. పట్టుబడిన నగదును సక్రమమైన ఆధారాలు చూపించినప్పుడు ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు అప్పగించడం జరుగుతుందని,
ఇప్పటి వరకు 95 కేసులు నమోదు చేసి 1 కోటి 9 లక్షల 55 వేల 920 రూపాయలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా అరికట్టడంతో పాటు బెల్టు షాపులను మూసివేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ రవాణా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ఇతర వివరాలపై సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి నగదు, మద్యం రవాణా జరుగకుండా జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, నిరంతర పర్యవేక్షణకు సిబ్బందిని కేటాయించడం జరిగిందని తెలిపారు.
👉 పోటీ చేసే అభ్యర్ధులు ఖర్చుల వివరాలను, ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించి తెలియజేయవలసి ఉంటుందని, ప్రతీ ఖర్చును రిజిష్టరులో నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలపై అధికారికంగా షాడో రిజిష్టరును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
👉 ప్రచార కార్యక్రమాలలో భాగంగా ముద్రించే కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియా, స్క్రోలింగ్, తక్కువ నిడివి గల అడ్వర్టైజ్ మెంట్లు, తదితర వాటికి ముందస్తుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటి అనుమతి పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు.
👉 పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అర్హులైన వారికి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 13 అత్యవసర శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
80 ఏండ్ల పైబడిన వారు, 40 శాతం పైబడి అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటినుండే ఓటు హక్కు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాలకు వెళ్ళలేని వారు 12 – డి ఫారంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని వివరించారు. అట్టి వారికి ఓటు వినియోగించుకునే సమయంలో వీడియోగ్రఫీ నిర్వహించడంతో పాటు ముందస్తు రూట్ మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్ తో పాటు ఎపిక్ కార్డు లేదా కమీషన్ గుర్తించిన 12 ఫోటో గుర్తింపుల కార్డులలో ఏదైనా ఒకదాన్ని వెంట తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు.


👉 జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా పంపిణి, స్వీకరణ కేంద్రాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ.వి.యం.ల కమిషనింగ్ ఆయా నియోజకవర్గాలలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
👉 ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ
శాంతి భద్రతల పరిరక్షణకు పోలిస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోపు ఎలాంటి గుంపులుగా ఉండకుండా, కేవలం ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలో ఉండాలని తెలిపారు.
👉అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ
నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థి వెంట కమీషన్ ఆదేశాల ప్రకారం ఇతరులను అనుమతించడం జరుగుతుందని సూచన ప్రాయంగా తెలిపారు.
👉అదనపు కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ
అభ్యర్ధుల ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రతీ ఒక్క అభ్యర్థి ఖర్చుల వివరాలు షాడో రిజిష్టర్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధులు డిజిటల్ లావాదేవీలను నిర్వహించాలని సూచించారు.
👉అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ, యం.సి.యం.సి, కేంద్రాలను, సి-విజిల్, సోషల్ మీడియా, తదితర విభాగాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపిస్తూ వివరించారు.
ఈ సమావేశంలో మాస్టర్ ట్రైనర్లు పి. తిరుపతి, సుధీర్, నోడల్ ఆఫీసర్లు రఘువరన్, భీమ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.