J.SURENDER KUMAR,
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ధర్మపురికి చెందిన సారంగుల అమర్నాథ్ ను ఆ పార్టీ నియమించింది.
కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియమించిన ప్రతినిధులు వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

రాష్ట్ర అధికార ప్రతినిధులు:
టి.కృష్ణ ప్రసాద్, రిటైర్డ్. IPS, అమరనాథ్ సారంగుల డా. కళ్యాణ్ నాయక్ ,డా. సోలంకీ శ్రీనివాస్ నాయక్, శ్రీమతి గడ్డం విజయ సునీత, జి వెంకట్ రెడ్డి
మీడియా నిర్వహణ:
శ్రీమతి కస్తూరి, సినీ ఆర్టిస్ట్ , విజిత్ కుమార్ శ్రీమతి. సుంకర మౌనిక, శ్రీ రాణా ప్రతాప్ లు ఉన్నారు.
ఉద్యోగానికి రాజీనామా చేసి…
హైదరాబాదులో బిహెచ్ఎల్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా నెలకు లక్ష. రూపాయలకు పైగా జీతం పొందుతూన్న సారంగుల అమర్నాథ్ 2013 లో ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నీ భారత ప్రధానమంత్రిగా ప్రమోట్ కోసం సర్వే నిర్వహిస్తున్న ఐటీ బృందానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఓ సెక్షన్ కు అమర్ కీలక బాధ్యతలు నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం నరేంద్ర మోడీ. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం మహోత్సవానికి 2014 మే మాసంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అమర్నాథ్ ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఆర్ఎస్ఎస్ బిజెపి అగ్రనాయకులతో అమర్ నాథ్ కు పార్టీ పరంగా విడదీయరాని సంబంధం బాంధవ్యాలు ఉన్నాయి