రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్!

J.SURENDER KUMAR,

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల షెడ్యూల్ ను  ప్రకటించారు. 

వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం చేపట్టే వివిధ కొత్త పథకాలు అమలుకు నోచుకోవు ..
కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఈ క్రింది నిబంధనలను అధికారులు, వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు, పాటించాల్సి ఉంటుంది.

👉 అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.


👉 అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.


👉 ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.


👉 సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.


👉 .ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.


👉 ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు… తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.


👉 పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.


👉 టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.


👉 ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు.


👉 శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు…