సీఈసీ రాజీవ్‌కుమార్
నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు!
ఒకే విడత ఎన్నికలు !
J.SURENDER KUMAR,
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని డిసెంబర్ 3న ఫలితాలు (కౌంటింగ్ చేపడుతారని) కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో వందేళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది, దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల తేదీలు..
👉నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3
👉నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10
👉నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13
👉నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15
👉పోలింగ్ తేదీ: నవంబరు 30
👉ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3
ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగరా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సీఈసీ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
