రత్నాకర్ రావు అభివృద్ధికి మారుపేరు! ఎత్తిపోతల పథకాలకు ఆయన పేరు పెట్టాలి!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..


J.SURENDER KUMAR,

స్వర్గీయ మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు, ఈ ప్రాంతల అభివృద్ధికి మారుపేరు అని. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఆయన పేరు పెట్టాలని. పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రత్నాకర్ రావు 96వ జయంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలో ఆయన విగ్రహానికి జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు తనయులు, నర్సింగరావు కృష్ణారావు, చంద్రశేఖర రావు,. డిసిసి అధ్యక్షుడు అట్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తాగు, సాగునీటి కోసం బీర్పూర్ లో రోళ్ల వాగు వాగు ప్రాజెక్టు, ఫిల్టర్ బెడ్ నిర్మాణం, ధర్మపురి పట్టణానికి తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనతతో పాటు గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ లతో సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత రత్నాకర్ రావు దే అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు, గిరి నాగభూషణం, సంఘనపట్ల దినేష్, ధర్మపురి మాజీ ఎంపీపీ బెత్తపు లక్ష్మణ్, వేముల రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కస్తూరి శ్రీనివాస్, తదితర కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అజాత శత్రువు – రత్నాకర్ రావు!
మంత్రి కొప్పుల ఈశ్వర్…

స్వర్గీయ మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు అజాతశత్రువు, నాలుగు దశాబ్దాల కాలం పాటు విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానం ఆయనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ముందుగా మంత్రి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సౌల భీమయ్య బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.