రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో గొల్లపల్లి బీఆర్ఎస్, బిజెపి నాయకులు చేరిక!

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ గొల్లపల్లి మండలం వెలుగుమట్ల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ, పార్టీలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏలేటి రాంరెడ్డి,
గొల్లపల్లి వార్డు మెంబర్ ఫోరం అధ్య క్షుడు బీఆర్ఎస్ సంయుక్త కార్యదర్శి గురిజాల బుచ్చిరెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కచ్చు మల్లయ్య, పడాల సత్తన్న, వెనుమట్ల వార్డు సభ్యుడు ఎల్లాల లింగారెడ్డి, యూత్ కన్వీనర్ ఎల్లాల విక్రం రెడ్డి, పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, సర్పంచ్ రేవెల్ల సత్యనారాయణగౌడ్, రాజేశ్వర్ రావు, నేరెల్ల మహేశ్, వూటూరి సతీష్ గౌడ్ లు క్రియాశీల పాత్ర పోషించారు.