👉 వెల్గటూర్ మండలంలో బీఆర్ఎస్ కు షాక్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం వెల్గటూర్ మండలం కు చెందిన ఐదుగురు సర్పంచులు గురువారం రాత్రి తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలంలో బిఆర్ఎస్ పార్టీ షాక్ కు గురైనట్టు సమాచారం.
సర్పంచ్ లు పాశిగామ సర్పంచ్ బొప్పు తిరుపతి, వెంకటపూర్ గ్రామ సర్పంచ్ రాందేనీ రమ కోటయ్య , ముంజంపెల్లి గ్రామ సర్పంచ్ పల్లె అశోక్ , సూరారం గ్రామ సర్పంచ్ బండారి లచ్చయ్య , రాంనూర్ గ్రామ సర్పంచ్ బొడుక మంజుల గంగయ్య ,.సింగిల్ విండో మాజీ ఛైర్మన్ గోపాల్ రెడ్డి లు. తమ అనుచర గణంతో చేరారు. అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర నాయకులు సర్పంచులతో రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. ఐదుగురు సర్పంచులకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జితేందర్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, సర్పంచ్ మురళి, ఉప సర్పంచ్ సందీప్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు, అసెంబ్లీ అధికార ప్రతినిధి విజయ్, రమేష్, గెల్లు శ్రీను, నరేష్, లక్ష్మణ్, అజయ్, సంతోష్, వెంకటేష్, వెంకట స్వామి, జితేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..