సహస్ర కు ప్రధాని మోడీ ప్రశంసా లేఖ !

👉 విద్యార్థిని,విద్యార్థులకు అభినందన లేఖలు.

.J.SURENDER KUMAR,

ప్రియమైన నిట్టూరి సహస్ర కు నా ఆశీస్సులు, ‘పరీక్షా పే చర్చ’ అంశంపై, చర్చలో పాల్గొని మీ ఆలోచనలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీలాంటి చిన్నారుల అభిప్రాయాలను తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడమనేది ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటూ భారత ప్రధానమంత్రి ప్రశంస లేఖలు వ్రాసి పోస్ట్ చేయడంతో విద్యార్థులు ఆనంద డోలికలలో తెలియాడుతున్నారు.

సహస్రకు ప్రధాని మోడీ రాసిన లేఖ.

వివరాలు ఇలా ఉన్నాయి.
2023 జులై 10 న విద్యాసంస్థలలో భారత ప్రభుత్వం ‘ పరీక్షా పే చర్చ’ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. విద్యార్థిని విద్యార్థులలో
యువతరంలో ని శక్తి, విశ్వాసం మరియు నైపుణ్యాలను చూడటం, దేశ ఆశలు, ఆకాంక్షలు ముడిపడి ఉన్న తదితర అంశాలు ‘ పరీక్షా పే చర్చ’ లో ప్రధానం.

నీ ట్టూరి సహస్ర.


హైదరాబాదులోని బీరంగూడ లోని ‘ రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్ ‘ సహస్ర’ పదవ తరగతి విద్యార్థిని, చర్చలో పాల్గొన్న సహస్ర కు స్వయాన భారత ప్రధానమంత్రి నరేందర్ మోడీ అభినందిస్తూ, లేఖ రాయడంతో పాటు పోస్టు ద్వారా ఆ లేఖను ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఇంటి అడ్రస్ కు రావడం,

లేఖలో ప్రధాని జీవితంలోని ప్రతి పరీక్షలోనూ విజయం సాధిస్తారనే ఆశతో… మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు అని.పేర్కొనడం పట్ల

నవ్య హోమ్స్ కాలనీవాసులు, చిన్నారి సహస్ర తల్లిదండ్రులు వంశీకృష్ణ గోమతి, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.