J.SURENDER KUMAR,
ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీల నాయకులు శ్రీ కొండగట్టు అంజన్న స్వామి దర్శనం కోసం తరలివస్తు తమ పార్టీలు పవర్ లోకి రావాలి అంటూ మొక్కుకుంటున్న. శ్రీ ఆంజనేయ స్వామి చూపు ఎవరు వైపు, ఏ పార్టీ వైపు ఉంటుందో అనే చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళితే..
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఈనెల 18 న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనంతో తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.

కొండగట్టు పుణ్యక్షేత్రంను రాహుల్ గాంధీతో పాటు, ఆ పార్టీ జాతీయ నాయకులు సైతం, కొండగట్టు క్షేత్రానికి రానున్నారనే వార్తలు , స్థానిక జాతీయ ప్రచార మాధ్యమాలలో రావడంతో , కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి మహిమలు, మహత్యం గూర్చి యావత్ దేశంలో ఆత్రుత, ఆసక్తి నెలకొంది. శ్రీ ఆంజనేయ స్వామి పవిత్ర ‘హనుమాన్ దీక్షలతో’ ఈ క్షేత్రం ఈపాటికే ఎనలేని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.

👉 సీఎం కేసీఆర్ కొండగట్టు క్షేత్ర అభివృద్ధి కోసం ₹1000 నిధులతో కొండగట్టు క్షేత్ర అభివృద్ధి పనుల భూమి పూజ కోసం, 2023, ఫిబ్రవరి 15న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

👉 కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, నాటి రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ 2021 ఆగస్టు 24న ప్రారంభించిన ‘ ప్రజా సంగ్రామ యాత్ర’ కు. ముందు ఆగస్టు 16న కొండగట్టులో ప్రత్యేక పూజలు చేసి యాత్రకు స్వీకారం చుట్టారు.

👉 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి 2023 మార్చ్ 6న శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించు ప్రత్యేక పూజలు చేశారు.

👉 ప్రముఖ హీరో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ వాహనం పూజ కోసం ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

👉 సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొండగట్టు క్షేత్రంలో ₹ 90 లక్షల వ్యయంతో శ్రీరామ స్తూప నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆమె అనేకసార్లు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
👉 దీనికి తోడు 2018 సెప్టెంబర్ లో. కొండగట్టు ఆర్టిసి బస్సు ప్రమాదంలో దాదాపు 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం. విధితమే. డిసెంబర్ 4న అంజన్న చూపు ఎవరి వైపు ఉందో స్పష్టం కానున్నది.