👉 జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత !
J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ కవిత కృషి తో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మ ఖండాంతరాలు దాటించిన రుద్రమదేవి మన కవితక్క జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు

భారత జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం వివేకానంద మినీ స్టేడియం లో నిర్వహించిన మహా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ…

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి విశేష కృషి చేస్తున్న కవిత కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ గ్రామాన చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్ ల నిర్మాణం కవిత కృషి తో….బతుకమ్మ ను ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత కవిత ..
బీడీ కార్మికులు ఎక్కువగా జగిత్యాల జిల్లా లో ఉన్నారని వారి కోసం బీడీ పెన్షన్ తీసుకువచ్చిన ఘనత కూడా కవిత దక్కుతుంది అన్నారు.
రాబోయే రోజుల్లో పి ఎఫ్ లేకుండా బీడీ పెన్షన్..
ఇంటింటా భీమా తో కెసిఆర్ ధీమా ₹,400 రూపాయలకు సిలిండర్ వంటి పథకాలు మహిళల కోసమే…

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ….
బతుకమ్మ పండుగ తో మహిళలు,యువతులు సాంప్రదాయబద్దంగా పండగను జరుపుకుంటున్నారు…మన పండగలను పిల్లలకు తెలియజేస్తూ పండగల విశిష్టత చెప్పాలి…ముఖ్యమంత్రి కృషి తో పల్లెలు, కాలం తో సంబంధం లేకుండా పచ్చదనం ,జల కళ తో సుభిక్షంగా ఉన్నాయి అని అన్నారు..తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలి అని అన్నారు.