తెలంగాణలో 3,17,17, 389 ఓటర్లతో తుది జాబితా రెడీ!

👉విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్!


J.SURENDER KUMAR,

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషన్​ వెల్లడించింది.. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 కాగా.. మహిళా ఓటర్లు 1,58,43,339 గా ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్​ జెండర్​ ఓటర్లు 2,557 గా ఉన్నారు.

జనవరితో పోలిస్తే 5,8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 17.01 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్​ వెల్లడించింది. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998:1000గా ఉంది.

ఓటర్ల తుది జాబితా వివరాలు :


👉 పురుషులు ఓటర్లు 1,58,71,493


👉మహిళలు ఓటర్లు1,58,43,339


👉ట్రాన్స్​ జెండర్​ ఓటర్లు 2,557


👉సర్వీసు ఓటర్లు15,338


👉ప్రవాస ఓటర్లు 2,780


👉మొత్తం3,17,17,389


👉 ఓట్ ఫ్రమ్ హోమ్..


ఈ ఎన్నికల్లో 4,87,950 మంది ఓటర్లు 80 ఏళ్లు పై బడిన వయోవృద్ధులు ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిర్ణయం వెలువడింది. ఇంటివద్ద నుంచే ఓటుహక్కును వినియోగించుకునే 80 ఏళ్ల పైబడిన వృద్ధులు.. పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేయాల్సి ఉంది. ఈ విధానాన్ని వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచి అమలు చేయనున్నట్లు సీఈసీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,87,950 మంది ఉన్నారు.
ఈఎన్నికల్లో ఓటర్ల జాబితాకు సంబంధించి కొత్త సాఫ్ట్​వేర్​ ఈఆర్పీ నెట్​2.0ను తీసుకువచ్చారు. దీని పనితీరు, ఇబ్బందులపై కేంద్ర ఎన్నికల కమిషన్​ సమీక్షించింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఈసీఐ బృందం పేర్కొంది. కర్ణాటక ఎన్నికల నిర్వహణ ఏ రకంగా చేశారనే విధానంపై ఈసీ అధ్యయనం చేయనుంది. దీనిపై కర్ణాటక అధికారులు వెళ్లి.. ఎన్నికల నిర్వహణ ఎలా అనే దానిపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచడంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎలాగైనా ఈసారి వాటిని అడ్డుకునేందుకు పక్కా ఫ్లాన్​నే సిద్ధం చేసుకుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలపై కూడా ఈసీ దృష్టి సారించింది.