వెల్గటూర్ మండల గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ !

J.SURENDER KUMAR,

ధర్మపురి అసెంబ్లీ పరిధి వెలగటూరు మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.
మండలంలోని జగదేవ్ పేట, కొత్తపేట, పడ్కల్, కప్పారావు పేట, పైడి పల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, పార్టీ శ్రేణులతో కలిసి లక్ష్మణ్ కుమార్ చేపట్టారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
ఒక ఎమ్మెల్యే గా, విప్ గా, మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్ మండలంలో ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టి ఇచ్చారో చెప్పాలని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ విషయంలో గాని, జంగనాల ప్రాజెక్ట్ కి శాశ్వత పరిష్కారం చూపించడం విషయంలో మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని, మిల్లర్ల చేతిలో ఈ ప్రాంత రైతాంగం దోపిడీకి గురి అవుతున్న మంత్రి కనీసం స్పందించలేదని, పలు ఆరోపణలు చేశారు.


మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 5వందలకే సిలిండర్, రైతులకి క్వింటాలుకు అదనంగా ₹ 500 రూపాయల సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ప్రతి మహిళకు చేయూత కింద ₹4వేల రూపాయల ఆర్థిక సహాయం, రేషన్ కార్డులను పంపిణీ నిరంతరంగా కొనసాగింపు, ₹2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామనికి అమలు చేస్తామని,హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జితేందర్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, ఎంపిటిసి మంజుల, సర్పంచ్ మురళి, ఉప సర్పంచ్ సందీప్, గెల్లు శ్రీనివాస్, పోలోజు శ్రీనివాస్, తిరుపతి, హరీష్, సంజీవ్, మహేష్, అశోక్, రత్నం, సుశీల్, రాజేష్, వినోద్, జితేందర్, వెంకట స్వామి, తిరుపతి, శశి,.రాకేష్ తదితరులు పాల్గొన్నారు