ఎన్నికల దృష్ట్యా జగిత్యాల జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్ట్ లు ఏర్పాటు!

👉 సీసీ కెమెరాల తో నిరంతర పర్యవేక్షణ !


👉ఎస్పి  ఎగ్గడి భాస్కర్!


J.SURENDER KUMAR,

గండి హన్మండ్లు, ఓబులాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పోలీస్ బార్డర్ చెక్పోస్ట్ ను  బుధవారంఎస్పీ భాస్కర్ ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో  పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని. జిల్లాలోని చుట్టూ ఉన్న అన్ని బార్డర్ల నందు 7 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగానే నూతనంగా నిర్మించిన గండి హన్మండ్లు, ఓబులాపూర్ చెక్ పోస్ట్లను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
రాత్రి పగలు ఇతర జిల్లాల నుండి వచ్చే ,వెళ్లే వాహనాలు  క్షుణ్ణంగా  పరిశీలించడం జరుగుతుందని ఇoదుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. డబ్బు మద్యం రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్ పోస్ట్ లు ప్రత్యేక గదులతో నిర్మించడం జరిగిందని ఇందులో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారని వచ్చి పోయే వాహనాలను, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు  అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎలక్షన్ ల సమయం లొ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పట్లు చేస్తుంది అన్నారు.
ప్రజలు, యువత ఎలక్షన్ సమయం లో ఎలాంటి గొడవలకు పోకుండా పోలీసువారికి సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమావలిని అందరూ పాటిస్తూ  వాహనాల తనిఖీలకు  ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీంద్రరెడ్డి, సి.ఐ లక్ష్మీనారాయణ ఎస్.ఐలు ఉమాసాగర్, చిరంజీవి, నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు