👉 కంట్రోల్ రూం నెంబర్ 1800 425 7620 !
👉 1950 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు !
👉 కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.!
J.. SURENDER KUMAR,
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అక్రమాలపై విజిల్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, డబ్బు, మద్యం, బహుమతులు, అక్రమ రవాణా లను అరికట్టాలని ఫిర్యాదు ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
గురువారం జగిత్యాల కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలోనీ ప్రజలకు సి విజిల్ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని,

ఫిర్యాదుడి పేరు గోప్యం !
జిల్లాలో ఎక్కడ అయిన అక్రమ మద్యం, డబ్బు, సరుకుల పంపిణీ, రవాణా జరిగినపుడు సాధారణ ప్రజలు కూడా సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు దారుని సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు . ₹ 50 వేల రూపాయలకు మించి ఆధారాలు లేని డబ్బులను పరిశీలించి సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ₹ 10 లక్షలకు పైన ఉన్న డబ్బుకు సంబంధించి ఇన్ కం టాక్స్ శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు.
యాప్ ద్వారా ఫిర్యాదు !
ఫోటో లేదా వీడియో, ఇతరత్రా ల ద్వారా ఫిర్యాదును యాప్ ద్వారా పంపవచ్చని తెలిపారు. అట్టి సమాచారం మేరకు సమీపంలోని ఫ్లయింగ్ స్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకొని అట్టి వాటిని పంచనామా, వీడియో గ్రఫీ చేస్తూ స్వాధీనం చేసుకోవడం, వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని, డబ్బుకు సంబంధించిన వాటి నోట్లను డినామినేషన్ తప్పని సరిగా నమోదు చేయాలని, రవాణా చేస్తున్న వారి సంతకం కూడా తీసుకోవాలని తెలిపారు. అట్టి సరుకు, డబ్బు నిజంగా అన్ని రుజువులు ఉన్న ట్లయితే జిల్లా కమిటీ కి అప్పీలు చేసుకునే విధంగా తెలియ పరచాలని సూచించారు. ఏదైనా సమాచారం జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు తెలియ జేయాలనుకునే వారి కంట్రోల్ రూం నెంబర్ 1800 425 7620 కు గాని, 1950 కు గాని కాల్ చేసి తెలియపరచ వచ్చని అన్నారు. జిల్లాలోని గోదాములను తనిఖీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

బ్యాంకు ఖాతాలో తనిఖి!
జిల్లాలో అధిక మొత్తంలో బ్యాంక్ ఖాతాల నుండి లావాదేవీలు జరిగిన వివరాలు, కొత్తగా ప్రారంభించిన ఖాతాల వివరాలు సమర్పించాలని బ్యాంక్ అధికారి నీ ఆదేశించారు. శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలో 18 ఫ్లయింగ్ టీమ్ లు రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయని, సర్వెలేన్స్ టీమ్ లు, ఇతర టీమ్ లు నిరంతరంగా ఎన్నికల నిర్వహణ సమయంలో పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ లు రాజేశ్వర్, నరసింహ మూర్తి, డి ఎస్ పి వెంకట స్వామి, LDM వెంకట్ రెడ్డి, ఇన్ కమ్ టాక్స్ అధికారి మేరీ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.