ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం !

👉మాస్టర్ శిక్షకుడు తిరుపతి ..

J.SURENDER KUMAR,

వచ్చే నెల 30 న జరుగనున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో నేటి నుండి రెండు రోజుల పాటు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులను కొరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల కేంద్రాలలో నిర్వహించనున్నారు.

జగిత్యాలలో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించు సమయంలో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన పనులపై ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించడం జరుగుతుందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీ.వీ.ప్యాట్ ల వినియోగంపై ఎన్నికలు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తీ అవగాహన కల్పించుటకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కోరుట్లలో..

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నియమావళిని అనునరించి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలతో పాటు ఎన్నికల సంబంధించిన మెటిరియల్ ను ఆయా పోలింగ్ సిబ్బందికి అందించడం జరుగుతుందని తెలిపారు.

ధర్మపురిలో


ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు జి. సంతోష్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి నరేష్, డిప్యూటి సి.ఇ.ఓ. రఘువరన్, ఆయా తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.