👉 ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ, ప్రజా ప్రతి నిధులు, నాయకుల సమన్వయ సమావేశం !
👉 పార్టీ శ్రేణులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ దిశా నిర్దేశం!
👉 నవంబర్ 2 న ధర్మపురిలో సీఎం కేసీఆర్ సభ!
👉 ఇంటింటికి ఈశ్వర్ అన్న కార్యక్రమం!
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి ఫంక్షన్ హల్ లో బుధవారం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ, ప్రజా ప్రతి నిధులు, నాయకుల సమన్వయ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అర్ధం అయ్యేలా వివరిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి కొప్పుల పిలుపు నిచ్చారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారం లేనిదే గెలుపు ఉండదని.. ఇందు కోసం అంత కలిసి కట్టుగా ఉండాలని కోరారు.
నియోజకవర్గం లో ప్రారంభించిన ప్రజా ఆశీర్వాద యాత్ర కు మంచి స్పందన.. ఆదరణ లభించిందని.. ఇతర గ్రామాల్లో ను యాత్ర చెప్పాడుతామని చేప్పారు. నవంబర్ 2..న ధర్మ పురి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభ ఉంటుందని చెప్పారు. నియోజకవర్గం లోని ప్రతి మండలం నుంచి.. పల్లె పల్లె నుంచి భారీగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. త్వరలోనే ఇంటింటికి ఈశ్వర్ అన్న కార్యక్రమం తలపెడుతున్నట్లు చెప్పారు.
నియోజకవర్గం లో ప్రభుత్వం చేపట్టిన పధకలు ఇంటిఇంటికి వివరిస్తామన్నారు.

నియోజక వర్గానికి గడిచిన పదేళ్ళ కాలంలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పధకాలే ప్రజలు మరోసారి బీఆరెఎస్ కు పట్టం కట్టెందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ శ్రేణులకు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని హామీలు ఇచ్చిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులను మంత్రి పేరుపేరునా ఆప్యాయత తో పలుకరించి.. పార్టీ విజయానికి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి కొప్పుల కోరారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మున్సిపల్ ఛైర్మన్, ఏడు మండలాల జెడ్పీటీసీలు, యంపిపిలు, యంపిటిసి లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, సింగిల్ విండో చైర్మన్ లు, పార్టీ మండల అధ్యక్షులు,మండల, గ్రామ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, రైతు బంధు సమితి సభ్యులు, కో ఆప్షన్ లు, యూత్, మహిళ ఆర్గనైజేషన్ సభ్యులు, క్లస్టర్, లీగల్, అడ్వైజరీ సభ్యులు పాల్గొన్నారు.