₹ 6 లక్షల నగదు పట్టివేత!
J.SURENDER KUMAR,
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో పాటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ కావడంతో జగిత్యాల జిల్లాలో పోలీసులు వేట ప్రారంభించింది.
కథలాపూర్ మండలం కలిగోట శివారులో బుధవారం పోలీసుల తనిఖీలు కారు లో తీసుకెళుతున్న ₹ 6,60,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్. తెలిపారు.

అక్రమ మద్యం స్వాధీనం!
జగిత్యాల పట్టణంలోని హన్మన్ వాడ లో అక్రమ మద్యం విక్రయిస్తున్న బుర్ర రామకృష్ణ అనే వ్యక్తిని పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇతని వద్ద 10 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

₹ 80 వేల చీరలు పట్టివేత!
వెల్గటూర్ మండలం చెగ్యం గ్రామంలో పాత సూర్య నారాయణ అనే వ్యక్తి ఎన్నికల సందర్భంగా మహిళలకు పంచడానికి సిద్దంగా ఉంచిన ₹ 80,550/- రూపాయల విలువ గల 179 చీరలను వెల్గటూర్ ఎస్సై శ్వేత సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు.

బైండోవర్..
జగిత్యాల రూరల్ మండలంలోని 35 మంది బెల్ట్ షాప్ నిర్వాహకులను రూరల్ తహసిల్దార్ రామ్మోహన్ ఎదుట బైండోవర్ చేసిన ఎస్ ఐ సదాకర్ బైండోవర్ చేశారు.
ఈ బైండోవర్ ని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు శిక్ష, ₹ 50వేల రూపాయల జరిమానా విధిస్తామని తహసీల్ధార్ వారిని హెచ్చరించారు.