👉ప్రతి రోజు ఆన్ లైన్ లో నివేదికలు !
👉ప్రైవేట్ సంస్థల తోపాటు, పార్టీ నేతలతో సర్వే
J.SURENDER KUMAR,
అధికార బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రతిరోజు రెండు సంస్థలతో పాటు పార్టీ లో ఎంపిక చేసుకున్న కొందరు నాయకులతో అసెంబ్లీలో పరిధిలో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రతిరోజు ఆయా సర్వే నివేదికలు ఆన్ లైన్ లో ఆ పార్టీ కీలక నాయకత్వా కమిటీకి పంపించాల్సి ఉంటుంది.
ప్రాధాన్యతను సంతరించుకున్న సర్వే సంస్థలు, 100 అసెంబ్లీ పరిధిలో ఆయా రాజకీయ పార్టీల బలా బలాలు, వారం, పది రోజుల, స్థితిగతుల సర్వేల విధానం చెక్ పెట్టినట్టు సమాచారం. నిత్యం సర్వే సంస్థలు రెండు, లేదా మూడు అసెంబ్లీల స్థితిగతుల నివేదికలు కమిటీకి అందించాల్సి ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే. పార్టీ పరంగా కీలక నాయకుల బృందం నిర్వహిస్తున్న సర్వేలో వారు ఏ ఒక్క ఓటర్ అభిప్రాయాలు సేకరించవద్దు. ప్రచార సరళిని, హోటల్లో, ఆర్టీసీ బస్టాండ్, బస్సులలో ఆటో స్టాండ్ లో, పబ్లిక్ మౌత్ టాక్ ను కచ్చితంగా నివేదికలో పొందుపరిచాల్సి ఉంటుంది.
మరుసటి రోజు మరో మూడు సర్వే సంస్థలు జంబ్లింగ్ పద్ధతి తరహాలో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వే చేసి నివేదికలు సైతం వారు పంపించాల్సి ఉంటుంది. ఈ తరహా సర్వే విధానం ఒక్కొక్క నియోజకవర్గ స్థితిగతుల పై మూడు సంస్థల నివేదికలను నిశితంగా పరిశీలించి ఆయా సెగ్మెంట్లలో గ్రామాల వారిగా, ప్రాంతాల వారీగా, ఆయా సామాజిక వర్గాల వారిగా పార్టీల , అభ్యర్థుల, బలము, బలహీనతలు ప్రత్యర్థి పార్టీ బలహీనతలను, ప్రచార తీరులో మార్పులు, చేర్పులు, తమ వెంట ఉన్న కొందరు నాయకులను ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేయడం. వారికి మరో ప్రాంతాలో ప్రచార బాధ్యతల అప్పగించడం, సలహాలు సూచనలను, పోటీ చేస్తున్న అభ్యర్థికి పార్టీ కీలక నాయకత్వ కమిటీ నేరుగా సమాచారం అందిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ అభ్యర్థి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్న, ప్రచారంలో ఉండి ఫోన్ ఆన్సర్ చేయకున్నా. వారి సెల్ ఫోన్ కు వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది.
సర్వే నిర్వహిస్తున్న సంస్థలు, పార్టీ లో కీలక వ్యక్తుల సర్వే బృందం. తమ సర్వే అంశాలను, ఉత్తర, దక్షిణ జిల్లాలతో పాటు. హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల సమాచారం. అధికార పార్టీలో కీలక ముఖ్య నాయకులకు పంపించడంతోపాటు. పిన్ పాయింట్ కచ్చిత సమాచారం నివేదికలలో పొందుపరుస్తున్నట్టు సమాచారం. ఈనెల 28 తేదీ వరకు సర్వే చేపట్టనున్నట్టు సమాచారం.